Advertisementt

వర్మ, మనోజ్ ల కోసం జగపతి..!

Fri 20th Feb 2015 05:21 AM
jagapathibabu,manchu manoj,ramgopalvarma,gayam movie  వర్మ, మనోజ్ ల కోసం జగపతి..!
వర్మ, మనోజ్ ల కోసం జగపతి..!
Advertisement
Ads by CJ

విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో సెలెక్టివ్ చిత్రాలలో నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు జగపతిబాబు. బాలయ్య 'లెజెండ్', రజిని 'లింగా' వంటి స్టార్ హీరోల సినిమాలో ప్రత్యర్ధి పాత్రలలో అదరగొట్టాడు. అంతే కాదు 'కరెంటు తీగ' , 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాలలో నెగెటివ్ పాత్రలో నటించి కామెడి కూడా పండించాడు.  మంచు మనోజ్ హీరోగా వర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో విలన్ గా నటించమని జగపతిని, మనోజ్ స్వయంగా అడగడంతో ఆయన డేట్స్ బిజీగా ఉన్నా అంగీకరించాడట. అంతకముందు జగపతిబాబుకి  'గాయం' వంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన వర్మ, 'గాయం2' తో తీవ్ర నిరాశ మిగిల్చాడు. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ