సాధారణంగా ఈరోజుల్లో ఒకటి రెండు హిట్లు రాగానే బడ్జెట్‌ను తామే శాసిస్తూ రావడం హీరోల వంతైపోయింది. అయితే దీనికి భిన్నంగా ‘స్వామిరారా, కార్తికేయ’ వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత కూడా యువహీరో నిఖిల్ నిర్మాతల హీరో అనిపించుకుంటున్నాడు. వీలైనంత తక్కువ బడ్జెట్‌తో సినిమా చేస్తూ నిర్మాతలకు మంచి లాభాలు తీసుకొని వస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ కూడా అదే కోవలోకి వస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్, ట్రైలర్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌లో రూపొందిన ఈ చిత్రానికి బడ్జెట్ కేవలం 3.5కోట్లు అని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం బిజినెస్ పూర్తయిందట. మొత్తంగా థియేటికల్ రైట్స్ 8కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం. ఇక శాటిలైట్‌రైట్స్ మీద మరో కోటి రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తంగా ఈ చిత్రం నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టినట్లు అయింది. ఈ మాత్రం ప్లానింగ్ ఉంటే రాబోయే రోజుల్లో నిఖిల్ మినిమం గ్యారంటీ హీరోగా ఓ ప్రత్యేక స్థానం సంపాదించడం ఖాయమని తెలుస్తోంది.