తెలుగు పరిశ్రమలో ఎంతో మంది నిర్మాతలున్నప్పటికీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నిర్మాత డా|| డి.రామానాయుడు గారు. కొంతకాలంగా అస్వస్థతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 18న మధ్యాహ్న వేళ మృతి చెందారు. ఈ వార్త తెలిసిన సినీ ప్రపంచం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించడానికి తరలివచ్చారు. కానీ స్టార్ హీరో అయిన బాలకృష్ణ ఎక్కడా కనిపించకపోయేసరికి ఆయన అభిమానులు నిరాశ చెందారు. ప్రెస్ నోట్ ద్వారా తన సంతాపాన్ని తెలిపినప్పటికీ స్వయంగా వచ్చి చూడనందున బాలయ్య అభిమానులు కలత చెందారు. గతంలో ఏ.ఎన్.ఆర్ ను చివరిచూపు చూడడానికి కూడా బాలకృష్ణ రాలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో అయ్యి ఉండి ఇలాంటి విషయాల్లో బాలకృష్ణ కనిపించక పోవడం నిజంగా అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.