Advertisementt

అమ్మను ఆకట్టుకోవడానికి అసెంబ్లీని తక్కువ చేస్తారా..!!

Thu 19th Feb 2015 07:11 AM
jayalalitha,dmk mlas suspended,assembly,tamilnadu  అమ్మను ఆకట్టుకోవడానికి అసెంబ్లీని తక్కువ చేస్తారా..!!
అమ్మను ఆకట్టుకోవడానికి అసెంబ్లీని తక్కువ చేస్తారా..!!
Advertisement

తమిళనాడులో రాజకీయాలు భలే తమాషాగా ఉంటాయి. అందునా ఏడీఎంకే పార్టీ నాయకులు జయలలితనను అమ్మగా సంభోదించడమే కాకుండా ఓ దేవతగా పరిగణిస్తారు. ఇక అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆమె ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే తమిళనాడు అసెంబ్లీలో జయలలితను నిందితురాలని డీఎంకే సభ్యులు సంభోదించినందుకు ఏడీఎంకే సభ్యులు పెద్ద రచ్చ చేశారు. వెంటనే డీఎంకే సభ్యులను సభ నుంచి బయటకు పంపించాలని ఏడీఎంకే సభ్యులు చేసిన డిమాండ్‌కు స్పీకర్‌కూడా మద్దతు పలికారు. అయితే కోర్టులో శిక్ష పడ్డ ఓ వ్యక్తిని తాము నిందితురాలు అన్న సంబోదించడంలో ఉన్న తప్పేమిటో చెప్పాలంటూ డీఎంకే సభ్యులు వాగ్వాదానికి దిగారు. దీంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. అమ్మను ఆకట్టుకోవడానికి ఏడీఎంకే సభ్యులు అసెంబ్లీ రూల్స్‌ను కూడా మారుస్తున్నట్లు కనిపిస్తోంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement