ఎన్నికలకు ముందు ఓ మాట.. అధికారంలోకి రాగానే ఓ మాట.. ఇప్పుడు మరోమాట అన్న తీరుగా కేసీఆర్ పాలన సాగుతోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసీఆర్ 'ఫాస్ట్' పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిప్రకారం తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే 1956కు ముందునుంచి వారి తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నట్లు ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాల్సి ఉంటుంది. దీనిపై అప్పట్లో అధికారులే విస్మయం వ్యక్తం చేశారు. ఇక సెటిలర్స్ హైదరాబాద్‌లో కబ్జాలు చేస్తున్నరంటూ గురుకుల్ భూముల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయించారు. అప్పుడు నాగార్జున ఎన్-కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించి కూడా కూల్చివేతలు కొనసాగుతాయనే వార్తలు ప్రచారమయ్యాయి. ఆ తర్వాత ఈ విషయంలో ప్రభుత్వం మిన్నకుండిపోయింది. కాని ఇప్పుడు కేసీఆర్ వాయిస్‌లో పూర్తిగా మార్పు వచ్చింది. హైదరాబాద్‌లో సెటిలర్స్ అంటూ ఎవరూ లేరని, ఇక్కడ పుట్టిన వారంతా తెలంగాణ బిడ్డలేనని ప్రకటించారు. మరి ఇదే ప్రకటనకు గతంలో ఎందుకు విరుద్ధంగా మాట్లాడారన్నది ఇప్పుడు అర్థంకాకుండా ఉంది. కేసీఆర్‌ను ఇప్పటికిప్పుడు మార్చింది ఎవరో తెలియకుండా ఉంది. ఈ మార్పు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రభావమేనంటారా..?