Advertisementt

అధికారపక్షాన్ని ప్రతిపక్షం చేశారు..!!

Thu 19th Feb 2015 05:01 AM
jdu,jithin rammaji,confidencemotion,bihar,nithish kumar  అధికారపక్షాన్ని ప్రతిపక్షం చేశారు..!!
అధికారపక్షాన్ని ప్రతిపక్షం చేశారు..!!
Advertisement

బీహార్‌లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. 233 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో జేడీయూకు 111 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 87 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నితీష్‌కుమార్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామ చేశారు. ఆ తర్వాత జితన్‌ రాం మాంజీ సీఎం పీఠానెక్కారు. మళ్లీ 8 నెలల కాలానికే నితిష్‌కుమార్‌కు సీఎం పీఠం మీద కూర్చోవాలన్న ఆశ పుట్టింది. దీంతో ఆయన మాంజీని సీఎం పీఠంనుంచి దిగిపోమన్నారు. దీనికి ససేమిరా అన్న మాంజీ జేడీయూని చీల్చారు. ప్రస్తుతం విపక్షం బీజేపీ మద్దతుతో మాంజీ అధికారంలో కొనసాగుతున్నారు. ఇక ఇన్నాళ్లు అధికారపక్షంగా ఉన్న జేడీయూ విపక్షంగా మారింది. ఇక శనివారం అసెంబ్లీలో విశ్వాసపరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో బీజేపీ మద్దతుతో మాంజీ నెట్టుకొస్తే ఇక జేడీయూ విపక్షం సీటుకే పరిమితం కావాల్సి ఉంటుంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement