Advertisementt

ఈ ఏడాది పరభాషా సంగీత దర్శకులదే....!

Thu 19th Feb 2015 04:56 AM
kolaveri music director,aniruddh,run raja run,jibras prabhas  ఈ ఏడాది పరభాషా సంగీత దర్శకులదే....!
ఈ ఏడాది పరభాషా సంగీత దర్శకులదే....!
Advertisement
Ads by CJ

మొత్తానికి ఈ ఏడాది ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే పలు పరభాషా సంగీత దర్శకులకు టాలీవుడ్ లో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. 'కొలవెరి' పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది ప్రస్తుతం తమిళంలో స్టార్స్ కు ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్  గా మారిన అనిరుధ్ కు తెలుగులో రామ్ చరణ్-శ్రీనువైట్ల చిత్రానికి సంగీతం అందించే అవకాశం వచ్చింది. ఇక మలయాళంతో పాటు తమిళంలో కూడా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు గోపీ సుందర్ 'నాగ్-కార్తి'లు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఇక కన్నడ సంగీత దర్శకుడు హరి త్వరలో విడుదలకు సిద్దమవుతున్న 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రానికి సంగీతం అందించాడు. తమిళంలో కమల్ హాసన్ నటిస్తున్న 'ఉత్తమవిలన్, విశ్వరూపం2, పాపనాశం' చిత్రాలకు సంగీతం అందించి, ఇటీవలే తెలుగులో వచ్చిన 'రన్ రాజా రన్' మూవీకి సూపర్ మ్యూజిక్ ను అందించిన జిబ్రాస్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న తాజా చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం దక్కించుకున్నాడు.     

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ