Advertisementt

మహేష్‌ పనిని సులభం చేసిన శ్రీకాంత్‌!

Thu 19th Feb 2015 04:55 AM
mahesh babu,sreekanth addaala,rakul preet singh,ram charan tej  మహేష్‌ పనిని సులభం చేసిన శ్రీకాంత్‌!
మహేష్‌ పనిని సులభం చేసిన శ్రీకాంత్‌!
Advertisement
Ads by CJ

నేడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల జోడీకి యూనిట్‌ నానా తిప్పలు పడుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌ ప్రారంభమైన తర్వాత కూడా హీరోయిన్లు ఖరారు కావడం లేదు. అయితే మహేష్‌బాబుకు జోడీ వెతికే పనిలో ఉన్న దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల, మహేష్‌కు ముందుగానే జాగ్రత్తపడి హీరోయిన్‌ సమస్య ఎదురవ్వకుండా మంచి పని చేసిపెట్టాడు. త్వరలో మహేష్‌బాబు హీరోగా పీవీపీ సంస్థ, శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో నిర్మించనున్న ‘బ్రహ్మోత్సవం’ అనే సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్‌బాబుకు జోడీగా కిందటి ఏడాది హీరోయిన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలిచిన రకుల్ ప్రీత్‌ సింగ్‌ను తీసుకున్నారు. దీంతో ఆమెకు కలగా మిగిలిన నెంబర్‌వన్‌ స్థానం దక్కించుకున్నట్లే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది ఆమె ఎన్టీఆర్‌, సుకుమార్‌ల చిత్రంతో పాటు, రామ్‌చరణ్‌, శ్రీనువైట్ల చిత్రం చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు మహేష్‌బాబు చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతో ఇక టాలీవుడ్‌ నెంబర్‌వన్‌ హీరోయిన్‌గా రకుల్  స్థానం ఖరారు అయినట్లే కనిపిస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ