Advertisementt

ఆదర్శవంతమైన వ్యక్తిని కోల్పోయాం..!

Thu 19th Feb 2015 01:48 AM
ramanaidu,ravi babu,sana yadireddy,allaani sreedhar  ఆదర్శవంతమైన వ్యక్తిని కోల్పోయాం..!
ఆదర్శవంతమైన వ్యక్తిని కోల్పోయాం..!
Advertisement
Ads by CJ

డైనమిక్ ప్రొడ్యూసర్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత డా|| డి.రామానాయుడు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేసారు.

ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ ప్రముఖ నిర్మాత అయిన డా|| డి.రామానాయుడు గారి మరణం నా మనసును ఎంతో బాధిస్తుంది. మనకున్నటివంటి అరుదైన నిర్మాతల్లో ఆయన ఒకరు. ఏ ఒక్కరినీ నొప్పించని మనసు ఆయనది. ఆయన నిస్వార్ధమైన నిర్మాత. తన చిత్రాలన్నీ తనే విడుదల చేస్తారు. చిత్రాల పబ్లిసిటీ విషయంలో మిగిలిన నిర్మాతలందరికీ ఆయన ఆదర్శప్రాయుడు. సినిమా నిర్మించి, దాన్ని అమ్మేసుకుని, సొమ్ము చేసుకోవాలనే తలంపుకానీ, అలాంటి ఆలోచన కానీ లేని ఆదర్శవంతుడాయన. అలాంటి మంచి వ్యక్తి, మన మనస్సులో నిత్యం కదిలే మనిషి, మహానుభావులు అయిన రామానాయుడు గారు ఇక లేరు అంటే, మనసు ఎంతో బాధపడుతుంది. ఆయన మరణ వార్త విన్న నా మనసు తట్టుకోలేకపోయింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఆయన అందించిన సేవలు అపూర్వం. వారి శ్రీమతి రాజేశ్వరిగారికి, కుమారులైన సురేష్ బాబుకి, వెంకటేష్ లకు నా సంతాపాన్ని తెలుపుతున్నాను" అని అన్నారు.

ప్రొడ్యూసర్ పొట్లూరి వర ప్రసాద్ మాట్లాడుతూ "తన హార్డ్ వర్క్ తో ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. నిర్మాత అంటే ఇలాగే ఉండాలనడానికి ఆయనే రోల్ మోడల్. ఎన్నో వందల కుటుంబాలకు ఆయన ఉపాధి కల్పించారు. తెలుగు సినిమాకి పెద్ద దిక్కు. తెలుగు సినిమాని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి. ఆయన మనల్ని విడిచి పెట్టి పోవడం ఎంతో బాధాకరం. ఎన్నో విలువలున్న ఆదర్శవంతమైన వ్యక్తిని కోల్పోయాం. ఆయన కుటుంబానికి నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవున్ని ప్రార్ధిస్తున్నాను. 

హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ "ఈరోజు మేం ఇండస్ట్రీలో నిలబడి ఉండడానికి కారణమైన వ్యక్తి రామానాయుడు గారు. నాన్నగారికి ప్రేమఖైదీ చిత్రంతో దర్శకునిగా అవకాసం ఇచ్చారు. నన్నగారికే కాదు ఎంతో మంది కొత్త దర్శకులకు ఆయన అవకాసం ఇచ్చారు. అలాగే అన్నయ్య రాజేష్ తో హాయ్, నిరీక్షణ వంటి రెండు చిత్రాలను నిర్మించారు. మా కుటుంబానికి ఆయనతో చాలా క్లోజ్డ్ అటాచ్మెంట్ ఉంది. నాన్నగారు ఎప్పుడూ ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి చెబుతుండేవారు. శతాధిక చిత్రాల నిర్మాతగా ఇండస్ట్రీలో నిర్మాత గొప్పతనాన్ని తెలియజేసిన వ్యక్తి. అలాంటి నిర్మాతను మళ్ళీ చూడలేమేమో అనిపిస్తుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్ధిస్తున్నాను"అని అన్నారు.

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ "రామానాయుడు గారు ఎంతో మంది కళాకారులకు తోడ్పాటు అందించిన గొప్ప వ్యక్తి. అలాగే ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి నిర్మాత అంటే ఎలా ఉండాలో తెలియజేసిన వ్యక్తి. ఎంతో మంది దర్శకులను పరిచయం చేసారు. సినిమా పరిశ్రమలో అందరికీ ఆప్తుడాయన. అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది. ఇండస్ట్రీ ఒక పెద్దను, ఆప్తుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను" అని అన్నారు.

నటుడు, డైరెక్టర్ రవిబాబు మాట్లాడుతూ "ఎంత పెద్ద దర్శకుడైనా సురేష్ ప్రొడక్షన్స్ లో రామానాయుడు గారితో కనీసం ఒక సినిమాకైనా పని చేయాలనుకుంటారు. అటువంటి అవకాసం నాకు లభించింది. ఎంతో గొప్ప దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయనతో కలిసి ఆయన బ్యానర్ లో పనిచేయడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో 'అవును2' సినిమాను డైరెక్ట్ చేసే అద్రుష్టం నాకు కలిగింది. రామానాయుడు గారు గొప్ప నిర్మాత. నిర్మాతలకు గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి. అటువంటి గొప్ప నిర్మాత మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను" అని అన్నారు.

 

తెలంగాణా ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షులు అల్లాణి శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ "శ‌తాధిక చిత్రాల నిర్మాత‌గా పేరు గాంచిన ప్ర‌ముఖ నిర్మాత డాక్ట‌ర్ రామానాయుడు ఆక‌స్మిక మృతి ప‌ట్ల తెలంగాణా ద‌ర్శ‌కుల సంఘం త‌రుపున తెలంగాణా ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడు ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత అల్లాణి శ్రీ‌ధ‌ర్ , కార్య‌ద‌ర్శి కాస‌ర్ల ముర‌ళి లు సంతాపం తెలియ జేశారు.  తెలంగాణాకు సంబందించిన ఎంద‌రో సాంకేతిక నిపుణుల‌ను .. న‌టీన‌టుల‌ను ...ద‌ర్శ‌కుల‌ను తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌కు ప‌రిచ‌యం చేసి ఎన‌లేని సేవ‌లు అందించిన డాక్ట‌ర్ రామానాయుడు గారి  స్పూర్తి రెండు తెలుగు రాష్ట్రాల చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు దిక్సూచి కావాల‌ని ఆకాంక్షిస్తూ వారి దివ్య స్మృతికి నివాళులు అర్పిస్తున్నాము" అని చెప్పారు. 

ప్ర‌ముఖ నిర్మాత సంగిసెట్టి దశరథ మాట్లాడుతూ "మా నిర్మాత‌లంద‌రికి మార్గ ద‌ర్శ‌కుడు అయిన ప్ర‌ముఖ నిర్మాత గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డు లో పేరు నమోదు చేసుకుని దాదాపు ప్ర‌ధాన భార‌తీయ భాష‌ల‌న్నింటిలోనూ సినిమాలు నిర్మించి ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచిన డాక్ట‌ర్ డి. రామానాయుడు ఆక‌స్మికంగా మృతి చెంద‌డం ప‌ట్ల మా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాము. ఆయ‌న చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ఉన్నంత కాలం ఎంద‌రికో మార్గ ద‌ర్శ‌కుడిగా నిలిచారు.ఆయ‌న  ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని వారి కుంటుబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాము" అని చెప్పారు.

తెలంగాణా నిర్మాత ల సంఘం అధ్య‌క్షుడు సానా యాదిరెడ్డి మాట్లాడుతూ "ప్ర‌ముఖ నిర్మాత .. ఎంద‌రికో ఆద‌ర్శ‌నీయుడు ..ఎన్నోసామాజిక సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన వ్య‌క్తి నిర్మాత‌గా వ్య‌క్తిగా ఎంతో సేవ చేసిన మూవీ మొఘ‌ల్ డాక్ట‌ర్ రామానాయుడు మృతి చెంద‌డం సినిమా ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు .. ఆయ‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు భీష్మాచార్యుడి లాంటి వాడు .. నిర్మాత‌గా ఆయ‌న నాకు ఆద‌ర్శ‌నీయుడు .. ఆయ‌న బాట‌లో ప‌య‌నించాల‌ని నేను సినిమా ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చాను. తెలుగు చ‌ల‌న చిత్ర సీమ బృతికి ఉన్నంత కాలం ఆయ‌న పేరు బ్ర‌తికే ఉంటుంది .. సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఆద‌ర్శ‌నీయుడిగా నిలిచిన డాక్ట‌ర్ రామానాయుడు ఆక‌స్మికంగా మ‌ర‌ణించ‌డం దుర‌దృష్ట క‌రం ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని వారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను" అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ