Advertisementt

రామానాయుడు మృతిపై పలువురి సంతాపం ..!

Thu 19th Feb 2015 01:23 AM
ramanaidu death,chiranjeevi,krishnam raju,dasari narayanarao  రామానాయుడు మృతిపై పలువురి సంతాపం  ..!
రామానాయుడు మృతిపై పలువురి సంతాపం ..!
Advertisement

రామానాయుడు గారు మృతి చెందారనే వార్త తెలియగానే సినీ ప్రపంచం ఆయన పార్ధివ దేహాన్ని సందర్శించడానికి వచ్చారు. ఆయన తనయుడు స్టార్ హీరో వెంకటేష్ మాట్లాడుతూ"ఈ రోజు మధ్యాహ్నం నాన్నగారు మృతి చెందారు. రేపు ఉదయం 9 గంటల తరువాత అభిమానుల సందర్శనానికి ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో పెడుతున్నాము. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాన్నగారికి చివరి కార్యక్రమాలు నిర్వహించనున్నాం" అని తెలిపారు.

దాసరి నారాయణ రావు మాట్లాడుతూ "స్వర్ణ యుగంలో పుట్టాము, పెరిగాము. కాని రోజు రోజుకి ఆ తెర పడిపోతుందనే భయం కలుగుతుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో సినిమాలను నిర్మించారు. సురేష్ బాబు వంటి మంచి ప్రొడ్యూసర్ ని, వెంకటేష్ లాంటి మంచి హీరోను మనకి ఇచ్చారు. ఆయన మరణంతో  రెండు రోజుల వరకు ఎలాంటి సినిమా షూటింగ్ కాని ఫంక్షన్స్ కాని జరగవు" అని అన్నారు.

చిరంజీవి మాటాడుతూ "తెలుగు సినిమాకి నిలువెత్తు నిదర్శనం, పర్యాయపదం రామానాయుడు గారు. ఆయన నాకు తండ్రితో సమానం. 30 సంవత్సరాల నుండి ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.

నటుడు మురళిమోహన్ మాట్లాడుతూ "ఎవరు తీయలేనన్ని చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఇక లేరు అనే విషయాన్ని నమ్మలేకపోతున్నాం" అని అన్నారు.

నటుడు కృష్ణమోహన్ మాట్లాడుతూ "రామానాయుడు నాకు మంచి ఆప్తుడు. ఆయన చిత్రాలలో 5 సినిమాలలో నటించాను. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలుపుతున్నాను" అని అన్నారు.

కమెడియన్ అలీ మాట్లాడుతూ "రామానాయుడు గారి సినిమాల ద్వారా ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 150 సినిమాల నిర్మాణం పూర్తి చేసుకున్న ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన ఇప్పుడు లేకపోవడం ఇండస్ట్రీ కి బ్యాడ్ లక్" అని అన్నారు.

డైరెక్టర్ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ "ఆయన ఇన్స్పిరేషన్ తోనే మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన ఇక లేరు అనడానికి నాకు చాలా బాధగా ఉంది. ఆయనతో ఒక సినిమా చేసాను. ఏ టైం అని ఆలోచించకుండా షూటింగ్ కు వచ్చేవారు సినిమా అంటే ఆయనకి అంత ఇష్టం. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి" అని అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ "నా సినిమా నానక్ రామ్ గూడ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడకి వచ్చి ఆయన ఎక్స్ పీరియన్స్, సినిమాకి సలహాలు చెప్పేవారు. సినిమా తప్ప ఆయనకి వేరే ప్రపంచం తెలియదు" అని చెప్పారు.

నటుడు ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ "అప్పటి వరకు జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్ననాకు మంచి అవకాశాలు ఇచ్చారు రామానాయుడు గారు. ఒక రోజు షూటింగ్ లో ఆయన పక్కన కూర్చోపెట్టుకొని నాకు ఫుడ్ పెట్టారు ఆ విషయం నేను ఎప్పటికి మర్చిపోలేను. గొప్ప నిర్మాతగా ఎదిగి అందరికీ స్పూర్తిగా నిలిచారు" అని చెప్పారు.

బి.ఏ.రాజు మాట్లాడుతూ "తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు ఆయన మరణం. మీడియా వాళ్ళని తన స్నేహితులుగా, ఫ్యామిలీ మెంబర్స్ గా భావించేవాళ్ళు. 'ముందడుగు', 'దేవత' సినిమాల నుంచి నాకు ఆయనతో అనుబంధం ఉంది. ఎంతో మందికి ఆయన లైఫ్ ఇచ్చారు" అని అన్నారు.

డైరెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ "నా కెరీర్ మొదలయినప్పటి నుండి ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. నా సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతున్నా వచ్చి ఆయన సలాహాలు ఇచ్చేవారు. ఆయన తో కలిసి సినిమా తీయాలని అనుకున్నాను కాని నా కల నెరవేరలేదు" అని అన్నారు.

హీరో రాజశేఖర్ మాట్లాడుతూ "రామానాయుడు గారికి గత 3 నెలలుగా పాలిటేటివ్ తెరపిని అందిస్తున్నాను. ఆయన ఇండస్ట్రీలోనే గొప్ప మనిషి'' అని అన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement