Advertisementt

డా.రామానాయుడు ఇక లేరు..!

Thu 19th Feb 2015 01:14 AM
daggubati ramanaidu,dadasahebfalke award,death  డా.రామానాయుడు ఇక లేరు..!
డా.రామానాయుడు ఇక లేరు..!
Advertisement

కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న రామానాయుడు ఫిబ్రవరి 18 మధ్యాహ్నం 2:30 సమయంలో అనారోగ్య కారణంగా మృతి చెందారు. దీంతో రామానాయుడు స్వగ్రామం కారంచేడులో  విషాద చాయలు నెలకొన్నాయి.1936 జూన్ 6 న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించిన డా. దగ్గుబాటి రామానాయుడు ప్రముఖ నిర్మాతగా వెలుగొందారు. 21 మందిని దర్శకులుగా, ఆరుగురిని హీరోలుగా, 12 మందిని హీరోయిన్లుగా, ఏడుగురిని సంగీత దర్శకులుగా పరిచయం చేసారు. 13 భాషల్లో 150 కి పైగా చిత్రాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. భారతీయ భాషలన్నిటిలో అత్యదిక చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్ లోకెక్కారు. ఇంగ్లీష్ లో కూడా ఒక సినిమాను తీసారు. సినిమాలలోకి రాక ముందు కారంచేడులో  రైస్ మిల్లు వ్యాపారం, వ్యవసాయం చేసేవారు. అనుకోకుండా చెన్నై వెళ్ళిన ఆయన 'అనురాగం' అనే సినిమాను నిర్మించారు. తరువాత ఎన్.టి.రామారావు గారు నటించిన రాముడు-భీముడు సినిమాతో హిట్ కొట్టారు. ఆ తరువాత వరుస ఫ్లాప్ లను అందుకున్న ఆయన ఏ.ఎన్.ఆర్ తో ప్రేమ్ నగర్ చిత్రాన్ని నిర్మించి పూర్వ వైభవం అందుకున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ పేరుతో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించారు. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలను తీసారు. 'హరివిల్లు' అనే పేరుతో బాలల చిత్రాన్ని నిర్మించారు. రామానాయుడు ఎన్నో అవార్డులు, పురస్కారాలతో పాటు చలన చిత్ర పరిశ్రమలో గౌరవ అవార్డ్ అయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 2013లో అందుకున్నారు. 1996 లో ఎస్వీయు నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. పద్మభూషణ్ సహా పలు అవార్డులను అందుకున్నారు. జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 1999 బెంగాలి అసుఖ్ చిత్రానికి జాతీయ అవార్డు పొందారు. 1987 లో ఆయన తనయుడు వెంకటేష్ నటించిన 'కలియుగపాండవులు సినిమాతో ఆయన కెరీర్ టర్న్ అయింది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement