Advertisementt

సమంత ఆశ..!

Wed 18th Feb 2015 07:56 AM
samantha,vikram kumar,kollywood star heroes,anjan  సమంత ఆశ..!
సమంత ఆశ..!
Advertisement
Ads by CJ

డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం' చిత్రంలో సమంత నటించింది. ఆమె నటనకు విమర్శకుల నుండి చాలా  ప్రశంసలు లభించాయి. సమంత తమిళ స్టార్ సూర్యతో నటించిన 'అంజాన్' చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రంలో సమంత నటనపై విమర్శకులు అనేక విమర్శలు చేశారు. త్వరలో సూర్య-విక్రమ్ కుమార్ ల కాంబినేషన్ లో రూపొందనున్న '24' చిత్రంలో సూర్య సరసన సమంత మరలా నటించనుంది. ఆమెను దర్శకుడు విక్రమ్ కుమార్ గట్టిగా పట్టుబట్టి తీసుకున్నాడట. ఈ చిత్రాన్ని 2 డి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్య  స్వయంగా నిర్మించనున్నాడు. ఈ చిత్రం హిట్ అయితే 'అంజాన్' విషయంలో జరిగిన పొరపాటును సరిదిద్దుకోవచ్చని, తమది హిట్ పెయిర్ గా ప్రూవ్ చేసుకోవాలని సమంత ఎంతో కసి మీద ఉందిట. అన్నట్లు ఆమెకు ప్రస్తుతం టాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమా 'సన్నాఫ్ సత్యమూర్తి' మాత్రమే చేతిలో ఉంది. ఇందులో ఆమె బన్నీ సరసన నటిస్తోంది. టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా తన కిష్టమైన, తనకు పుట్టిల్లు అయిన కోలీవుడ్ లో ఆమెకు విక్రమ్, విజయ్, సూర్య వంటి స్టార్స్ చిత్రాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ