Advertisementt

అఖిల్ చిత్రం విశేషాలు..!

Wed 18th Feb 2015 06:22 AM
akhil akkineni,v.v.vinayak,sai srinivas,alludu seenu  అఖిల్ చిత్రం విశేషాలు..!
అఖిల్ చిత్రం విశేషాలు..!
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం వినాయక్ దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక వినాయక్ విషయానికి వస్తే ఆయన చిత్రాలన్నీ హై బడ్జెట్ తో రూపొందుతుంటాయి. కిందటి ఏడాది బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తూ ఆయన తీసిన 'అల్లుడుశ్రీను' చిత్రానికి కూడా 40 కోట్లు ఖర్చు పెట్టించాడు. లాభాలు రాకపోయినప్పటికీ ఎలాంటి ఇమేజ్ లేని సాయిశ్రీనివాస్ సినిమా 30 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ నేపధ్యంలో వినాయక్ అఖిల్ చిత్రానికి కూడా నితిన్ చేత 40 కోట్లు బడ్జెట్ పెట్టిస్తున్నట్లు సమాచారం. అయితే అఖిల్ మొదటి చిత్రానికి ఉండే క్రేజ్ దృష్ట్యా 40 కోట్లు పెద్ద పెట్టుబడి కాదని, సాయిశ్రీనివాస్ సినిమానే 30 కోట్లు వసూలు చేసినప్పుడు అఖిల్ చిత్రం ఈజీగా 40 కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ