నిర్మాత బి.నాగిరెడ్డి అంటే తెలియని వారు లేరు. తెలుగు సినిమాకు దశ-దిశ నిర్దేశించిన నిర్మాత ఆయన. ఎన్నో మరువలేని చిత్రాలని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ముఖ్యంగా 'పాతాళభైరవి', 'గుండమ్మ కథ', 'మాయాబజార్' వంటి సినిమాలు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాయి. పలు పురస్కారాలు అందుకున్న ఆయన సేవా కార్యక్రమాలు కూడా చేసారు. ఆయన వందవ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు 2012 లో బి.నాగిరెడ్డి మెమోరియల్ అవార్డును ఏర్పాటు చేసారు. ఉత్తమ చిత్రాలను తీసిన నిర్మాతలకు ఈ అవార్డును అందజేస్తూ వచ్చారు. ఏప్రిల్ 19న ఈ అవార్డు వేడుకను ఘనంగా నిర్వహించనున్నామని ఆయన తనయుడు బి.వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఈ అవార్డును దిల్ రాజు(2012), సాయి కొర్రపాటి(2013), భోగపల్లి ప్రసాద్(2014) అందుకున్నారు. ఈ సంవత్సరం కూడా ఓ నిర్మాతకు అవార్డును ఇవ్వనున్నామని ఆయన తనయుడు తెలిపారు. ఆ నిర్మాత ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!