రామ్ చరణ్ ఇప్పటివరకు కేవలం మాస్ సినిమాలపైనే దృష్టి కేంద్రీకరిస్తూ వస్తున్నాడు. మధ్యలో వచ్చిన 'ఆరెంజ్' తప్ప ఆయన చేసినవన్నీ ఆవే చిత్రాలు. అయితే 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంతో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ప్రయత్నించాడు. సినిమా అనుకున్న ఫలితాలను ఇవ్వకపోయినప్పటికీ రామ్ చరణ్ ప్రయోగం ఫలించి ఎంతో కొంత మేర ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. తాజాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో చేసే సినిమాతో ఎంటర్ టైన్ మెంట్ ను, కామెడీని పండించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇలాంటి చిత్రాలు ఓవర్ సీస్ లో బాగా మార్కెట్ అవుతాయి. ఈ విషయాన్ని ఓ సంఘటన నిజం చేస్తుంది. ఓవర్ సీస్ లో మార్కెట్ కు చరణ్ చేస్తున్న ఫలితాలు మెల్లగా ఫలిస్తున్నాయి. రామ్ చరణ్ తో పాటు శ్రీనువైట్ల చేసే సినిమా ప్రారంభం కాకముందే ఓ డిస్త్రిబ్యూటర్ ఈ చిత్రానికి 7 కోట్లు చెల్లించి ఓవర్ సీస్ రైట్స్ కొనుగోలు చేశాడట. ఓవర్ సీస్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి వారికే ఇంతటి మార్కెట్ ఉంది. రామ్ చరణ్ కు అంత మార్కెట్ ఓవర్ సీస్ లో లేదు. అయితే ఇక్కడ రామ్ చరణ్ కాకపోయినా శ్రీనువైట్ల, కోనవెంకట్, గోపీమోహన్ ల కాంబినేషన్ ప్లస్ అవ్వడంతో ఇంత మొత్తం ఓవర్ సీస్ రైట్స్ పలికాయి అన్నది వాస్తవం. దీన్నిబట్టి రామ్ చరణ్ స్ట్రాటర్జీ బాగానే వర్కౌట్ అవుతోందనే చెప్పాలి.