Advertisementt

ఆకట్టుకుంటోన్న అఖిల్..!

Mon 16th Feb 2015 11:28 PM
akhil,akkineni family,v.v vinayak,saayeshaa sigal  ఆకట్టుకుంటోన్న అఖిల్..!
ఆకట్టుకుంటోన్న అఖిల్..!
Advertisement
Ads by CJ

మొత్తానికి అఖిల్ లాంచింగ్ ప్రోగ్రాం అదిరిపోయింది. అక్కినేని కుటుంబంతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం అందరినీ మరీ ముఖ్యంగా అక్కినేని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కూడా విశేషంగా అలరిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి అక్కినేని కుటుంబంతో పాటు హీరో నితిన్ కూడా ఎంతో హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. ఈ చిత్రంలో వినాయక్ అఖిల్ చేత అన్ని రసాలు పలికించే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం యాక్షన్ హీరోగానే కాదు.. రొమాంటిక్ గా, ఫ్యామిలీ ఎమోషన్స్ ను సైతం మొట్టమొదటిసారి తనదైన శైలిలో చూపించనున్నాడట. ఇక ఈ చిత్రంలో అక్కినేని అఖిల్ కు హీరోయిన్ సాయేషా సైగల్ తో లిప్ లాక్ సీన్ కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి ఏయన్నార్ నుండి నాగార్జునతోపాటు తాజాగా నాగచైతన్య, అఖిల్ లు కూడా ఎన్ని చిత్రాలు చేసినా తమకుండే  మన్మధుడు బిరుదును నిలబెట్టుకొని, దానిపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ