Advertisementt

నంద‌మూరి 3 బ్లాక్ బ‌స్ట‌ర్స్ వెనుక పీవీపీ హ‌స్తం !

Mon 16th Feb 2015 01:15 PM
pvp,legend,patas,temper,nandamuri family,temper audio  నంద‌మూరి 3 బ్లాక్ బ‌స్ట‌ర్స్ వెనుక పీవీపీ హ‌స్తం !
నంద‌మూరి 3 బ్లాక్ బ‌స్ట‌ర్స్ వెనుక పీవీపీ హ‌స్తం !
Advertisement
Ads by CJ

నంద‌మూరి కుటుంబం నుంచి గ‌త ఏడాది కాలంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో ఒక కామ‌న్ పాయింట్ ఉంది. అదేంట‌న్న‌ది ఇప్ప‌టికే చాలా మంది ఊహ‌కు అందే ఉంటుంది. అవును. ప‌లువురు ఊహించిన ఆ కామ‌న్ అంశం పేరు పీవీపీ. ఏడాది కాలంలో విడుద‌లైన నంద‌మూరి మూడు చిత్రాల వెనుకా పీవీపీ ఉన్నారు. బాల‌కృష్ణ లెజండ్‌, క‌ల్యాణ్ రామ్ ప‌టాస్‌, ఎన్టీఆర్ టెంప‌ర్‌. ఈ మూడు సినిమాల‌కు పీవీపీ మ‌ద్ద‌తిచ్చారు. ఈ మూడు సినిమాల‌కూ పీవీపీ ఫైనాన్షియ‌ల్ స‌పోర్ట్ చేశారు. పీవీపీ హ‌స్తం ఉంటే నంద‌మూరి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్ర‌హ్మాండ‌మైన కాసుల వ‌ర్షం కురిపిస్తున్నాయ‌న్న విష‌యం ఇప్ప‌టికే అభిమానుల్లోకి, ప్ర‌జ‌ల్లోకీ చేరింది. ఆ మ‌ధ్య టెంప‌ర్ ఆడియోలో పీవీపీ మాట్లాడిన తీరును బ‌ట్టే నంద‌మూరి అభిమానులు విజ‌యాన్ని గొప్ప‌గా ఊహించుకున్నారు. ఇప్పుడు వారి ఊహ‌ల‌న్నీ నిజ‌మ‌య్యాయి. టెంప‌ర్ నిర్మాణ ద‌శ నుంచే పీవీపీ అందులో ఉన్నారు. ప్ర‌తి చిన్న విష‌యంలోనూ త‌న‌వైన స‌ల‌హాలు, సూచ‌న‌లూ ఇచ్చారు. భ‌విష్య‌త్తుల్లోనూ ఎన్టీఆర్ ప్రాజెక్టుల వెనుక తానుంటాన‌ని పీవీపీ అన్న మాట‌లు అభిమానుల్లో నూత‌నోత్సాహాన్ని నింపాయి. టెంప‌ర్ బిజినెస్ ను ముందే ఊహించిన పీవీపీ మేథ‌ను ఇప్ప‌టికే ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు స్తుతిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ