మిల్కీ బ్యూటీ గా సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారామణుల్లో తమన్నా ఒకరు. అమ్మడు సినిమాల్లోకి అడుగుపెట్టి అప్పుడే దశాబ్దకాలం గడిచిపోయింది. ఈమె ఇటీవల మాట్లాడుతూ... నేను ఇప్పటివరకు ప్రేమలో పడలేదు. ఏ అబ్బాయితోనూ డేటింగ్ అనుభవం కూడా లేదు. ఒకవేళ నాకు ప్రేమించాలనే ఆలోచన వచ్చి ఉంటే ఎవరో ఒకరు నచ్చే వారేమో...! కానీ నాకు ఇప్పటి వరకు అలాంటి ఆలోచన రాలేదు. అంత ఆలోచించే సమయం నాకెక్కడ ఉంది? అంటూ ప్రశ్నించింది. ప్రేమ, డేటింగ్ వంటి అనుభవాలు బావుంటాయనే అనుకుంటున్నాను. కానీ ప్రస్తుతం నన్ను నేను, నా ప్రేమను సినిమాలకే అంకితం చేశాను... అని చెప్పుకొచ్చింది.