దూకుడు, బాద్ షా వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను డైరెక్ట్ చేసిన శ్రీనువైట్ల ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. మార్చి 5 న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. రెగ్యులర్ షూటింగ్ మార్చి 16 వ తేదీ నుండి మొదలవుతుంది. అయితే ఈ సినిమా అక్టోబర్ నెలలో రిలీజ్ కానుందని సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ముందే అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరివాడేలే' సినిమా అక్టోబర్ లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ సంపాదించుకుంది. అదే సెంటిమెంట్ ను వర్కవుట్ చేయడానికి రామ్ చరణ్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను కూడా అదే నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 'మై నేమ్ ఈస్ రాజు' అనే టైటిల్ ను ఈ చిత్రానికి అనుకుంటుంనట్లు సమాచారం. మొదటి సారిగా రకుల్ ఈ సినిమాలో రామ్ సరసన నటించనుంది.