Advertisementt

లాంగ్‌ గ్యాప్‌ తర్వాత రాబోతున్న శ్రీ రాఘవ!

Mon 16th Feb 2015 03:28 AM
sri raghava,selva raghavan,varna,anushka,beautiful love story  లాంగ్‌ గ్యాప్‌ తర్వాత రాబోతున్న శ్రీ రాఘవ!
లాంగ్‌ గ్యాప్‌ తర్వాత రాబోతున్న శ్రీ రాఘవ!
Advertisement
Ads by CJ

తమిళంలో సెల్వరాఘవన్‌గా, తెలుగులో శ్రీరాఘవగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్‌ అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ‘వర్ణ’ చిత్రం భారీ డిజాస్టర్‌ కావడంతో ఆ తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చాడు. అంతేకాక ఆ బాధలో అసలు డైరెక్టర్‌ వృత్తిని వదిలేస్తానని కూడా ప్రకటించాడు. ‘7 బై జి బృందావనకాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, యుగానికి ఒక్కడు’ వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలుగా మిగిలిపోయాయి. అయినా తన రిటైర్‌మెంట్‌ యోచనను ప్రక్కన పెట్టి, మళ్ళీ ఈ దర్శకుడు ఓ మంచి లవ్‌స్టోరీని తయారు చేసుకున్నాడట. ఈ స్టోరీ విన్న తమిళ యంగ్‌ స్టార్‌ శింబు, వెంటనే ఈ చిత్రంలో చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని కోలీవుడ్‌లో వార్తలు వినబడుతున్నాయి. త్వరలో ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభం కానున్నాయని తాజాగా సమాచారం అందుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ