Advertisementt

నాగ్ విషయంలో చైతు ఫీలవుతున్నాడా?

Sun 15th Feb 2015 03:02 AM
naga chaitanya,nagarjuna,akhil,feeling,nag  నాగ్ విషయంలో చైతు ఫీలవుతున్నాడా?
నాగ్ విషయంలో చైతు ఫీలవుతున్నాడా?
Advertisement
Ads by CJ

అక్కినేని నాగార్జున నటవారసుడిగా ‘జోష్’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన నాగచైతన్య ఇప్పుడిప్పుడే నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాందించుకుంటున్నాడు. దాదాపుగా 10 చిత్రాల్లో నటించినా ఇప్పటి వరకు నాగచైతన్యకు స్టార్ హీరో దక్కలేదు. ఇక నాగార్జున,అమల దంపతుల ముద్దుల కొడుకు అఖిల్ కూడా సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు. ‘మనం’ చిత్రంలో తళుక్కున మెరిసి అందర్ని ఆకట్టుకున్న అఖిల్ హీరోగా నటించేందుకు సర్వం సిద్ధమైంది. హీరో నితిన్ నిర్మాతగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం నేడు( ఫిబ్రవరి 14న) సినీరంగ ప్రముఖుల సమక్షంలో, అభిమానుల సమక్షంలో హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో అంగరంగవైభవంగా ప్రారంభం కాబోతుంది. అంతేకాదు తన నటవారసుడ్ని అభిమానులకు, సినీప్రముఖులకు నాగ్ ఇదే వేదికపై పరిచయం చేస్తున్నాడు. అయితే ఈ విషయంలో నాగచైతన్య కాస్త అసంతృప్తిగా వున్నాడని ఫిల్మ్‌నగర్ సమాచారం. తన తొలిచిత్రం ప్రారంభం సందర్భంలో నాగ్ ఇలాంటి కార్యక్రమాలేమీ లేకుండా సింపుల్‌గా చేశాడని నాగచైతన్య కాస్త అసంతృప్తిగా వున్నాడట. అఖిల్‌కు, తనకు తేడా చూపించడం చైతుకు నచ్చలేదట.సో.. నాగ్ ఇక చైతును ఎలా సంతృప్తిపరుస్తాడో చూడాలి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ