హీరో హీరోయిన్లు తమ సొంత గొంతును వినిపిస్తూ పాటలు పాడటం సినిమాకు మరింత క్రేజ్ రావడానికి దోహదపడుతోంది. దీంతో చాలా మంది స్టార్స్ ఈ మధ్య గొంతు సవరించుకుంటున్నారు. దానికి నిర్మాత, దర్శకులు, సంగీత దర్శకులు కూడా ప్రోత్సాకం అందిస్తున్నారు. ఇలా పాటగాళ్ళుగా ప్రతిభ చూపించడానికి మరో బాలీవుడ్ బ్యూటీ సిద్దమయింది. తన లేటెస్ట్ మూవీ 'తమాషా'లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికాపడుకోనే ఓ పాటను స్వయంగా పాడుతోంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ హీరో. దర్శకుడు ఇంతియాజ్ అలీ. ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. రెహ్మాన్-ఇంతియాజ్ అలీలది మ్యూజికల్ హిట్ కాంబినేషన్. గతంలో వీరు కలిసి పనిచేసిన 'జబ వుయ్ మెట్, రాక్ స్టార్, హైవే' తదితర చిత్రాలు మ్యూజికల్ గా పెద్ద హిట్ అయ్యాయి. దీంతో దీపికాపడుకోనే పాడే పాట కూడా అద్భుతమైన క్యాచీ ట్యూన్ అయి ఉంటుందని బాలీవుడ్ వర్గాల నమ్మకం. మరి ఈ చిత్రంతో సింగర్ గా దీపికాపడుకోనే ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది.