ఏపీలో మద్యం ధరల వ్యవహారం పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం చెప్పిన ధరలకు తాము మద్యాన్ని విక్రయించలేమంటూ వైన్స్ దుకాణాల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఇక విజయనగరంలో ఏకంగా మద్యం దుకాణాల బంద్ పాటిస్తున్నారు. అయితే గతంలోనూ ఉమ్మడి రాష్ట్రంలో ఇదే సమస్య వచ్చి పడింది. వైన్స్ దుకాణాల యజమానులు సిండికేట్‌గా మారి ఎమ్మార్పీ కంటే కూడా అధిక ధరలకు మద్యం అమ్మడం ప్రారంభించి కోట్లు గడించారు. దీని వెనుక ఓ మంత్రి ఉన్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. మళ్లీ ఇప్పుడు అదే సమస్య వచ్చి పడింది. దీనికిబదులుగా ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు కొనసాగుతున్నాయి. ఆ మంత్రి ఇప్పుడు కూడా అధికారంలో ఉంటే తమకు ఇన్ని తిప్పలు వచ్చి ఉండేవి కావని మద్యం దుకాణాల వ్యాపారులు వాపోతున్నారు.