అందం, ఒడ్డుపొడుగు, మంచి పర్సనాలిటీలకు తోడు నటనలో మంచి టాలెంట్ ఉన్న యువహీరో శర్వానంద్. అన్ని ఉన్నప్పటికీ ఆయన కెరీర్ స్టార్ట్ అయిన దశాబ్దకాలంలో ఆయనకు కమర్షియల్ గా మంచి హిట్ అయిన చిత్రాలను వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. ఆవగింజంత అదృష్టం లేకపోవడమే ఈ హీరో మైనస్ గా చెప్పుకోవాలి. తన కెరీర్ లో 'గమ్యం, ప్రస్థానం, అందరి బంధువయ్యా' చిత్రాలు ఆయన నటనా పటిమకు ఉదాహరణలుగా నిలిచినప్పటికీ ఆయనకు కమర్షియల్ బ్రేక్ మాత్రం 'రన్ రాజా రన్' ద్వారానే వచ్చింది. అయితే హిట్టు వచ్చింది కదా! అని అదే రూటు లో వెళ్ళకుండా మరో వైవిధ్యమైన చిత్రం 'మళ్లీమళ్లీ ఇది రాని రోజు' చిత్రంతో మరో హిట్టును అందుకుని, తనదైన వైవిధ్యాన్ని చూపించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం స్టడీ కలెక్షన్స్ తో ముఖ్యంగా ఏ సెంటర్లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంటోంది. ఈ హిట్టుతో ఆయన 'బెంగుళూరుడేస్' రీమేక్ లో కూడా సిద్ధార్థ్ స్థానంలో వచ్చిచేరాడు. ఇక ' 'మళ్లీ మళ్లీ రాని రోజు' విషయానికి వస్తే ఎక్కువగా కామెడీ ఉన్న చిత్రాలు విజయాలు సాధిస్తున్న నేటి రోజుల్లో వినోదం లేకుండానే మంచి హిట్టు దిశగా ఈ సినిమా దూసుకెళ్లడం ఆశ్చర్యపరుస్తోంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఎంటర్ టైన్ మెంట్, స్టార్ హీరోల చిత్రాలకే పెద్దపీట వేసే టీవీ ఛానెల్స్ కూడా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కోసం పోటీపడ్డాయి. చివరకు మాటీవీ ఈ చిత్రానికి 4కోట్ల 25లక్షలకు సొంతం చేసుకుందని సమాచారం. ఆయన నటించిన 'రన్ రాజా రన్' చిత్రం శాటిలైట్ రైట్స్ 3.5కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ హిట్టుతో ఆయన 'బెంగుళూరుడేస్' రీమేక్ లో కూడా సిద్ధార్థ్ స్థానంలో వచ్చిచేరాడు. ఇక ' 'మళ్లీ మళ్లీ రాని రోజు' విషయానికి వస్తే ఎక్కువగా కామెడీ ఉన్న చిత్రాలు విజయాలు సాధిస్తున్న నేటి రోజుల్లో వినోదం లేకుండానే మంచి హిట్టు దిశగా ఈ సినిమా దూసుకెళ్లడం ఆశ్చర్యపరుస్తోంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఎంటర్ టైన్ మెంట్, స్టార్ హీరోల చిత్రాలకే పెద్దపీట వేసే టీవీ ఛానెల్స్ కూడా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కోసం పోటీపడ్డాయి. చివరకు మాటీవీ ఈ చిత్రానికి 4కోట్ల 25లక్షలకు సొంతం చేసుకుందని సమాచారం. ఆయన నటించిన 'రన్ రాజా రన్' చిత్రం శాటిలైట్ రైట్స్ 3.5కోట్లకు అమ్ముడయ్యాయి. ఇలా స్టడీగా కెరీర్ ను సాగిస్తే ఆయనకు మంచి భవిష్యత్తుతో పటు నిర్మాతలు కూడా ఈ యువ హీరో పై పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారనేది విశ్లేషకుల మాట.