Advertisementt

మరో తమిళ దర్శకుడితో వెంకీ..!

Sat 14th Feb 2015 05:07 AM
venkatesh,kollywood,nirmal kumar,thriller zone  మరో తమిళ దర్శకుడితో వెంకీ..!
మరో తమిళ దర్శకుడితో వెంకీ..!
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో ఘనవిజయం సాధించిన 'సలీం' చిత్రానికి డైరెక్షన్ చేసిన దర్శకుడు ఎన్.వి.నిర్మల్ కుమార్ ఇటీవల తెలుగు సీనియర్ స్టార్ వెంకటేష్ కు ఓ స్టోరీ లైన్ వినిపించాడని తెలుస్తోంది. స్టోరీ లైన్ బాగా నచ్చడంతో వెంకీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, త్వరగా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ను రెడీ చేయమని కోరాడని, ప్రస్తుతం ఆ పనుల్లో నిర్మల్ కుమార్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 'దృశ్యం' తర్వాత మరలా వెంకటేష్ సోలో హీరోగా చేస్తున్న చిత్రం  ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రంలో వెంకటేష్  స్లిమ్ గా  కనిపించాల్సిన అవసరం ఉండటంతో ప్రస్తుతం వెంకటేష్ అదే పనిలో ఉన్నాడని, వెయిట్ తగ్గే పనిలో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం థ్రిల్లర్ జోనర్ లో రూపొందనున్నట్లు సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ