విక్రమ్ ఎంతో కష్టపడి చేసిన 'ఐ' సినిమా బాగా నిరాశపరచడంతో విక్రమ్ ఆవేదన చెందుతున్నాడు. 'ఐ' చిత్రం చూసిన వారు మాత్రం విక్రమ్ లాంటి నటుడిని ఎవ్వరినీ ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చూడలేదంటూ అంతలా కష్టపడిన విక్రమ్ తప్పేమీలేదంటూ ఆయనపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం విక్రమ్ విజయ్ మెల్టన్ దర్శకత్వం లో సమంతా హీరోయిన్ గా ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలకు సిద్దమవుతోంది. ఆ వెంటనే ఆయన ఇటీవల సూపర్ హిట్ అయిన 'ఎన్నై అరిందాల్' దర్శకుడు గౌతమ్ మీనన్ కేవలం విక్రమ్ నే దృష్టిలో పెట్టుకుని తయారుచేశాడట. ఏప్రిల్ లోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. మరి గౌతమ్ మీనన్-విక్రమ్ ల కాంబినేషన్ లో రానున్న ఈ మొదటి చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచిచూడాలి...!