రాజకీయాల్లో మంచి వక్తగా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు పేరుంది. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఏపీనుంచి ఆయన సమైక్యవాదాన్ని బలంగా వినిపించారు. ఇక రాష్ట్ర విభజన అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూవస్తున్నారు. అయితే ఇటీవలే ఆయన మళ్లీ రాజకీయాల్లోయాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ నేతలకు దూరంగా ఉంటున్న ఉండవల్లి రాజధానికి సంబంధించి మాత్రం హడావిడి చేస్తున్నారు. ఇటీవలె ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఇక మరి ఉండవల్లి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారంటే బీజేపీలో చేరే అవకాశాలుంటాయని అందరూ భావించారు. కాని రాజధాని ప్రాంతంలో పర్యటనలో భాగంగా ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు. ఏపీకిచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని, రాష్ట్రవాసులను ఆ పార్టీ మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. దీన్నిబట్టి ఆయన బీజేపీలోకి వెళ్లే అవకాశాలు కూడా కనబడటం లేదు. మరి ఉండవల్లి ఏ దూర దృష్టితో ఆలోచనలు చేస్తున్నారో..??.