Advertisementt

హైదరాబాద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహేష్‌ బాబు

Thu 12th Feb 2015 11:51 AM
hyderabad brandambassador,mahesh babu,nithin,sania mirza  హైదరాబాద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహేష్‌ బాబు
హైదరాబాద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహేష్‌ బాబు
Advertisement
Ads by CJ

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచడంపై ఇప్పుడు టీఆర్‌ఎస్‌ దృష్టిసారించింది. ఇప్పటికే సానియామీర్జాను తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించి దాదాపు రూ.  2 కోట్ల నజరానా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్‌కు ప్రత్యేకంగా మరో బ్రాండ్‌ అంబాసిడర్‌ను నియమించాలని యోచిస్తోంది. దీనికోసం టాలీవుడ్‌ హీరోలు మహేష్‌బాబు, నితిన్‌ల పేర్లు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే మహేష్‌బాబు ఏపీలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంను దత్తత తీసుకుంటారని ఆయన బావ, ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి ఆయన పేరును హైదరాబాద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం కష్టమేనన్న ఉహాగానాలు వినబడుతున్నాయి. మరోవైపు నితిన్‌ తెలంగాణకు సంబంధించిన వ్యక్తే అయినప్పటికీ ఆయనకు స్టార్‌ హోదా లేకపోవడం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. అయితే తుదకు ఈ ఇద్దరిలోనే ఒకరి పేరును టీ-సర్కారు ఎంపిక చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ