హీరోయన్ పూనమ్ కౌర్ ఇంట్లో చోరీ జరిగింది. ఆమె ఇంట్లో దొంగలు పడి సుమరు రూ. ఐదున్నర లక్షల విలువ చేసే వజ్రాల హారాన్ని ఎత్తుకెళ్లారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు. కొద్ది రోజుల క్రితం బాంద్రా వెళ్లినప్పుడు పూనమ్‌కౌర్ ఈ వజ్రాల హారం ధరించారట. అయితే అది ఆమె సొంతం కూడా కాదని, ఓ నగల దుకాణం నుంచి అరువు తెచ్చుకున్నట్లు సమాచారం. తీరా దుకాణానికి ఆ హారాన్ని అప్పగించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ ఆభరణం కోసం ఇంట్లో వారు వెతికినా లభించలేదు. దీంతో చేసేది లేక పూనమ్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి ఆ నగను బయటినుంచి వచ్చిన దొంగలు చోరీ చేశారా..? లేక ఇంట్లోని వ్యక్తులు తీశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలె అవకాశాలు సన్నగిల్లి కష్టాల్లో ఉన్న పూనమ్‌కౌర్ ఆభరణం మిస్ కావడం మరో తలనొప్పిగా మారింది.