200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన 'ఐ' చిత్రం ఓపెనింగ్ కలెక్షన్లు అదరగొట్టినప్పటికి లాంగ్ రన్ లో చతికిలపడి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. దీంతో 'ఐ' విషయంలో నిరాశ చెందిన విషయాన్ని శంకర్ నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు. పోయిన చోటనే వెతుక్కోవాలనే సిద్ధాంతంతో మరోసారి విక్రమ్ నే హీరోగా పెట్టి లోబడ్జెట్ సినిమా చేస్తానని, డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను పూడుస్తానని మాట ఇస్తున్నాడు. మరి శంకర్ మదిలో లోబడ్జెట్ అంటే ఎంత? అనేది విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన దృష్టిలో వందకోట్లు అంటే లోబడ్జెట్ అని అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా సరే హైబడ్జెట్ శంకర్ కాస్తా వాస్తవంలోకి వచ్చి లోబడ్జెట్ శంకర్ గా మారిపోయాడని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.