అనుష్క టైటిల్ పాత్రలో ‘రుద్రమదేవి’గా, అల్లు అర్జున్ గోనగన్నారెడ్డిగా నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను మహాశివరాత్రి కానుకగా ఈనెల 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్‌లో అనుష్క, అల్లు అర్జున్‌లకు చెందిన అద్భుతమైన విజువల్స్ ఉంటాయని తెలుస్తుంది. ఈ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించి, అదిరిపోయే రేంజ్‌లో ప్రమోషన్ చేసేందుకు దర్శకనిర్మాత గుణశేఖర్ సన్నాహాలు చేస్తున్నారు. మార్చి చివరి వారంలో ఈ చిత్రం విడుదల అవుతుందని అంటున్నప్పటికీ, అదే వారంలో బాలకృష్ణ ‘లయన్’ కూడా విడుదలకు రెడీ అవుతుండటంతో, ఈ రెండు చిత్రాల్లో ఏది మార్చి చివరివారంలో వస్తుంది? ఏది వెనక్కి వెళుతుంది? అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతుంది.