Advertisementt

పవనా, పాత్రా!! అనసూయకి ఏది నచ్చడం లేదు..!

Thu 12th Feb 2015 03:17 AM
pawan kalyan,anasuya,attharintiki daredi,gopala gopala  పవనా, పాత్రా!! అనసూయకి ఏది నచ్చడం లేదు..!
పవనా, పాత్రా!! అనసూయకి ఏది నచ్చడం లేదు..!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌ నటించే చిత్రంలో ఎలాంటి అవకాశం వచ్చినా ఎగిరి గంతేస్తారు. కానీ టీవీ యాంకర్‌ అనసూయ మాత్రం దీనికి రివర్స్‌లో వెళుతోంది. అలా చేయడం ద్వారానే తనకు మంచి పబ్లిసిటీ వస్తుందనే నమ్మకంతో అనసూయ అలా బిహేవ్‌ చేస్తుందని పవన్‌ అభిమానులు ఆరోపిస్తున్నా..అసలు అనసూయ మనసులో ఏముందనేది మాత్రం తెలియడం లేదు. ఒక్క పవన్‌ విషయంలోనే అనసూయ ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇలా పవన్‌తో వచ్చిన అవకాశాలు తిరస్కరించడం వల్ల, తను హాట్‌ టాపిక్‌గా మారుతుందన్నది మాత్రం వాస్తవం. అంతకుముందు ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ఐటమ్‌సాంగ్‌ చేయమంటే చేయను పొమ్మంది. తాజాగా ‘గోపాల గోపాల’ చిత్రంలో కూడా ఛాన్స్‌ని వదులుకున్నానని తానే స్వయంగా ఓ రియాలిటీ షో లో చెప్పుకొచ్చింది. ‘గోపాల గోపాల’ చిత్రంలో  వెంకీని ఇంటర్య్వూ చేసే పాత్ర కోసం ముందు, అనసూయనే అడిగారంట. అనసూయ చేయను అని చెప్పడంతో..ఆమె స్థానంలో అనీషా అంబ్రోస్‌ని తీసుకున్నారట. సో.. ఇదంతా చూస్తుంటే.. అసలు అనసూయకి పవన్‌ అంటే పడటం లేదా! లేక నిజంగానే పాత్ర నచ్చడం లేదా..! అనే అనుమానాలు కలుగక మానవు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ