Advertisementt

అనుష్క సాంగ్‌ని తీసేశారు..!

Wed 11th Feb 2015 09:04 AM
anushka song,ajith,ennai arindaal,hit talk  అనుష్క సాంగ్‌ని తీసేశారు..!
అనుష్క సాంగ్‌ని తీసేశారు..!
Advertisement
Ads by CJ

అజిత్‌, అనుష్క, త్రిష లు ముఖ్యపాత్రల్లో నటించిన ‘ఎన్నై అరిందాల్‌’ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌తో పాటు, అదిరిపోయే కలెక్షన్స్‌ని కూడా రాబడుతోంది. అయితే సినిమా ఫస్ట్‌హాఫ్‌ కాస్త సాగతీత ఎక్కువైందనే టాక్‌ నేపథ్యంలో ఆ ఫీలింగ్‌ను పోగొట్టేందుకు ఫస్టాఫ్‌ను కొంత ట్రిమ్‌ చేసేందుకు దర్శకనిర్మాతలు సిద్ధపడ్డారు. కొన్ని అనవసర సీన్స్‌తో పాటు అనుష్క మీద వచ్చే ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను కూడా పూర్తిగా తీసేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై సాధారణ ప్రేక్షకుల సంగతి ఎలా ఉన్నా, అనుష్క అభిమానులు మాత్రం కాస్త అసంతృప్తిగా ఫీలవుతున్నారట. ఈ మార్పుల తర్వాత సినిమా కలెక్షను మరింతగా పెరుగుతాయని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రంతో మరలా లైమ్‌లైట్‌కి వచ్చిన ఒకప్పటి భారీ చిత్రాల నిర్మాత ఎ.ఎం. రత్నం కాస్త కుదుటపడ్డాడనే చెప్పాలి. ఈ చిత్రం అందించిన విజయంతో ఆయన ఈ సినిమాను తెలుగులోకి ‘ఎంతవాడుగానీ’ టైటిల్‌తో అనువాదం చేయాలని భావించినప్పటికీ..తాజాగా ఈ సినిమాను టాలీవుడ్‌లోని ఓ అగ్రహీరోతో రీమేక్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంతో హీరో అజిత్‌ మరోసారి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ‘ఆరంభం, వీరం’ ల తర్వాత వచ్చిన ‘ఎన్నై అరిందాల్‌’ కూడా హిట్‌ కావడంతో అజిత్‌కు మరో హ్యాట్రిక్‌ సొంతమైంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ