పవన్ కళ్యాన్ తాజాగా 'గబ్బర్ సింగ్2'పై దృష్టి పెట్టాడు. ఈ చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ ఈ చిత్రానికి గాను పవన్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని ఫిలిం నగర్ టాక్. 20 కోట్లలో సినిమాను పూర్తి చేయాలని, ఈ చిత్రం బిజినెస్, రిలీజైన తర్వాత కలెక్షన్లలో సినిమా బడ్జెట్ పోనూ మిగిలిన లాభాలలో సగం వాటా తీసుకోవాలని పవన్ డిసైడ్ అయ్యాడట. ఈ పద్దతిని ఫాలో అయిన పవన్ 'గోపాల గోపాల' చిత్రం పెద్దగా ఆడనప్పటికీ భారీగానే లాభాలు అందుకున్నాడు. పవన్ కళ్యాన్ చిత్రం అంటే ఎలాగూ 50 కోట్లు వస్తాయి. దాంట్లో సినిమా బడ్జెట్ 20 కోట్లు పోనూ, మిగిలిన 30 కోట్లలో సగం అంటే 15 కోట్లు పవన్ కు సినిమాలో నటించినందుకు దక్కుతుంది. ఇక పై తన చిత్రాల విషయంలో ఇలాగే ఫాలో కావాలని పవన్ డిసైడ్ అయ్యాడట. అయితే 'గోపాల గోపాల' చిత్రాన్ని భారీ రేట్లకు అమ్మడం వల్ల కొందరు డిస్ట్రి బ్యూటర్లకు స్వల్ప నష్టాలు మిగిలాయని, కానీ తన 'గబ్బర్ సింగ్2'లో అలాంటి ప్రాబ్లమ్ కూడా రాకూడదని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.