ఢిల్లీలో ఆప్ పార్టీ సృష్టించిన సునామీ విజయం దేశంలోని పలువుర్ని ప్రభావితం చేసినట్లు కనబడుతోంది. ఆప్ పార్టీ స్ఫూర్తితో పలువురు కొత్తగా పార్టీలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆప్ స్ఫూర్తితో మరో పార్టీ ప్రారంభం కావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. మేధావి, దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు 'నవ్యాంధ్ర' పేరుతో కొత్త పార్టీ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూలై 26న నవ్యాంధ్రను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే దళిత వర్గ నేతగా ముద్రపడ్డ కత్తి పద్మారావు మరి అన్ని పార్టీలను ప్రభావితం చేయగల పొజిషన్‌లో ఉన్నారా అనేది అనుమానమే. అంతేకాకుండా అర్బన్ ఏరియా, అక్షరాస్యతా శాతం అధికంగానే ఉండటంతోనే ఆప్ పార్టీకి ఢిల్లీలో ఘన విజయం సాధ్యమైంది. మరి అక్షరాస్యతశాతం తక్కువగా ఉండి, నూతన ఒరవడికి దూరంగా ఉండే ఏపీ ప్రజలు నవ్యాంధ్ర పార్టీకి ఎంతవరకు మద్దతు ఇస్తారనేది కూడా అనుమానమే.