Advertisementt

ఉత్తమనటుడు ఎవరో తేలనుంది..!

Wed 11th Feb 2015 03:52 AM
kamalhasan,ameerkhan,pk movie,remake rights  ఉత్తమనటుడు ఎవరో తేలనుంది..!
ఉత్తమనటుడు ఎవరో తేలనుంది..!
Advertisement
Ads by CJ

దేశం గర్వించదగ్గ నటుడు ఎవరు? అంటే దక్షినాది వారు టక్కున విశ్వ నాయకుడు కమల్ హాసన్ పేరు చెబుతారు. కానీ దీన్ని ఉత్తర భారతీయులు అంటే బాలీవుడ్ వారు ఒప్పుకోరు. వారి దృష్టిలో మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్  ఖాన్ ఉత్తమనటుడు. అయితే వీరిద్దరిలో ఎవరు ఉత్తమనటుడో తేలనుంది. ఇటీవల విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ కూడా దద్దరిల్లేలా చేసి భారీ వసూళ్లు సాధించిన అమీర్ ఖాన్ 'పీకే' చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో కమల్ హాసన్ నటించనున్నాడు. ఈ చిత్రం  రీమేక్ రైట్స్ ను జెమిని ఫిలిం సర్క్యూట్స్ సంస్థ సొంతం చేసుకుంది. మరి ఈ చిత్రంలో కమల్ నటన అమీర్ ను మించిన స్థాయిలో ఉంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ రీమేక్ ద్వారా దేశ ఉత్తమనటుడు ఎవరో తేలనుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ