విజయ్ హీరోగా ఆయన సరసన హన్సిక, శ్రుతిహాసన్ జోడీగా అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం 'పులి'. ఈ చిత్రానికి శింబుదేవన్ దర్సకత్వం వహిస్తునాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇటీవల కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా అయింది. ఈ చిత్రంలో శ్రీదేవికి సంబంధించిన కొన్ని సీన్స్ ను హన్సికతో కలిపి తీయాల్సివచ్చిందట. అయితే యూనిట్ సభ్యుల షెడ్యూలింగ్ సరిగాలేనందున శ్రీదేవి చాలా ఇబ్బందిపడినట్లు సమాచారం. కొన్ని కారణాల వల్ల హన్సిక తో చేయాల్సిన సీన్ కోసం శ్రీదేవి దాదాపు 4గంటలు వెయిట్ చేసిందని తెలుస్తోంది. శ్రీదేవి రేంజ్ లో ఉన్నవారు ఇంతటి ఆలస్యాన్ని, అసౌకర్యాన్ని అస్సలు సహించరు. అయితే శ్రీదేవి మాత్రం పరిస్థితి అర్ధం చేసుకొని కోపం ప్రదర్శించకుండా కూల్ గా ఉందట. అదే వేరొకరు అయితే పరిస్థితి వేరేగా ఉండేదని, ఏదో ఒక గొడవ చేసేవారని యూనిట్ సభ్యులే ఒప్పుకొంటున్నారు. శ్రీదేవి మంచి మనసున్న వ్యక్తి అని పొగిడేస్తున్నారు.