ఒకవైపు పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల సరసన నటించాలనే కోరికను వెలిబుచ్చిన రెజీనా ఇప్పుడు యువ స్టార్ హీరోల సరసనే కాదు.. అవకాశం వస్తే సీనియర్ స్టార్స్ సరసన నటించేందుకు కూడా తనకు అభ్యంతరం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇది చుసిన వారంతా రెజీనా మంచి నిర్ణయం తీసుకుందని అంటున్నారు. కేవలం అప్ కమింగ్ స్టార్ హీరోల సరసనే కాకుండా సీనియర్ హీరోల సరసన కూడా నటిస్తే త్వరగానే మంచి గుర్తింపుతో పాటు అవకాశాలు, ఆర్ధికపరంగా కూడా బాగుంటుందని, ఆమె నిర్ణయం సరైనదే అని అంటున్నారు. మరి త్వరలో ఆమెకు అవకాశం ఇచ్చే సీనియర్ స్టార్ హీరో ఎవరో తేలుతుంది...!