ఎవరూ ఊహించనిరీతిలో ఆప్ పార్టీ అఖండ విజయం సాధించింది. గతంలోలా కాకుండా ఢిల్లీ వాసులు ఆప్ పార్టీకి భారీ స్థాయి మెజార్టీ ఇచ్చారు. హోరాహోరీ తప్పదనుకున్న విశ్లేషకులను అంచనాలను తలకిందులు చేస్తూ ఢిల్లీ ప్రజలు బీజేపీని కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలిపించారు. ఇక కిరణ్‌బేడీని బీజేపీ సీఎం అభ్యర్థిగా రంగంలోకి దింపి ఆప్‌కు తలతిరిగే ఎత్తుగడ వేశామనుకున్న బీజేపీని ఆమె ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. కిరణ్‌బేడి ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్థి బగ్గా చేతిలో 2500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక మద్యం, డబ్బు, మతం ప్రలోభాలను పక్కకు పెట్టి ఢిల్లీ సామాన్యులు ఇచ్చిన ఈ తీర్పు దేశ భవిష్యత్తు గతిని మారుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 67 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న ఆప్ పార్టీ అధినేతగా ఢిల్లీ సీఎం పీఠం ఎక్కనున్న కేజ్రీవాల్‌ను అటు ప్రధాని మోడీ, ఆయన గురువు అన్నాహజారే అభినందించారు.