ప్రత్యేక హోదాపై కేంద్రం తప్పించుకు తిరిగే ధోరణిని ప్రదర్శిస్తోంది. ఈ హోదాను ఇవ్వడం సాధ్యం కాదని చెప్పకనే చెబుతున్న కేంద్రం.. కంటితుడుపుగా ఆర్థికసాయాన్ని అందిస్తామని చెబుతూ దాటవేత ధోరణిని ప్రదర్శిస్తోంది. ఇక నీతి ఆయోగ్ సమావేశం గురించి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా గురించి మోడీని ప్రశ్నిస్తే.. ఈ విషయాన్ని అరుణ్‌జైట్లీతోనే చర్చించాలని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని జైట్లీని ప్రశ్నించినప్పటికీ సూటిగా సమాధానం ఇవ్వలేదు. అందుకు బదులుగా ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలకంటే కూడా అధికంగానే సాయం చేస్తామని ప్రకటించారు. మరి విభజన బిల్లులో పొందిపరిచిన విధంగా ప్రత్యేక హోదానే ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్న .. కేంద్రం ఇక ఉత్తర భారత రాష్ట్రాలను, బీజేపీ పాలిన రాష్ట్రాలకు కూడా మించి ఏపీకి సాయం చేస్తుందన్న మాటలు నమ్మశక్యంగా లేవని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి బాబు వెనకడుగు వేస్తున్నారని, ఆయన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని విమర్శిస్తున్నారు.