హీరోయిన్ అంజలి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మానందం ముఖ్యపాత్రల్లో రాజ్ కిరణ్ దర్శకునిగా పరిచయం అవుతూ.. ఎం.వి.వి. సినిమా పతాకంపై కోనవెంకట్ సమర్పణలో సత్యనారాయణ నిర్మించిన 'గీతాంజలి' చిత్రం మంచి హిట్ గా నిలిచింది. చిన్న బడ్జెట్ చిత్రంగా రూపొందిన ఈ మూవీ మంచి కలక్షన్లే రాబట్టింది. కాగా త్వరలో ఈ సినిమా హిందీలోకి రిమేక్ కానుంది. బాలీవుడ్ కు చెందినా ఓ ప్రొడక్షన్ కంపెనీ ఈ హక్కులను చేజిక్కించుకొంది. దీనికోసం 70 లక్షలు ఇచ్చారని సమాచారం. ఓ చిన్న సినిమాకు 70 లక్షలు అనేది పెద్ద అమౌంటే అని అంటున్నారు. మరి ఈ హారర్ కామెడీ మూవీ బాలీవుడ్ లో ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.