Advertisementt

మహేష్ చిత్రానికి వంశీ స్టొరీ..!

Sat 07th Feb 2015 10:41 PM
mahesh babu,poorijagannath,vakkamtham vamsi,hit story  మహేష్ చిత్రానికి వంశీ స్టొరీ..!
మహేష్ చిత్రానికి వంశీ స్టొరీ..!
Advertisement
Ads by CJ

'రేసుగుర్రం' సూపర్ హిట్ తో మంచి ఊపు మీద ఉండి, స్టార్ రైటర్ గా మారిపోయిన వక్కంతం వంశీ త్వరలో మహేష్ బాబు చిత్రానికి కథను అందించనున్నాడని సమాచారం. పూరిజగన్నాథ్ తో మహేష్ బాబు చేసే చిత్రానికి వంశీ స్టొరీని అందిస్తున్నాడు. మొదటి సారిగా పూరి ఎన్టీఆర్ హీరోగా చేస్తోన్న 'టెంపర్' చిత్రాన్ని వంశీ స్టొరీనే తీసుకున్న సంగతి తెలిసిందే. వక్కంతం స్టొరీ, వర్కింగ్ స్టైల్ పూరికి బాగా నచ్చడంతో మహేష్ చిత్రానికి కూడా ఓ మంచి కథను ఇవ్వమని పూరి వంశీని కోరినట్లు సమాచారం. ఇప్పటికే వంశీ పూరికి ఈ చిత్రానికి సంబంధించిన రెండు మూడు స్టొరీలైన్లు వినిపించాడని, ఓ స్టోరీని డెవలప్ చేయమని పూరి సూచించినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కు గతంలో సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఫెయిలయిన 'అతిథి' చిత్రానికి వంశీనే స్టొరీ అందించాడు. ఆ చిత్రం సరిగ్గా ఆడకపోవడంతో ఈ సారి ఎలాగైనా హిట్ స్టొరీ ని అందించాలనే కృషితో వంశీ ఉన్నాడట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ