మాస్ మహారాజా రవితేజ సినిమాలో మెయిన్ విలన్ అవకాశం అంటే మాటలు కాదు. అలాంటి అవకాశం తను వెతుక్కుంటూ వచ్చింది కానీ చేయలేకపోతున్నాను అంటూ తెగ బాధపడిపోతున్నాడు బాలీవుడ్ నటుడు విక్రం సింగ్. ఆయనకు రవితేజ హీరోగా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'కిక్2'లో అలంటి అవకాశం వచ్చిందట. గతంలో బాలీవుడ్ లో 'హీరోపంతి' , తెలుగులో '1'(నేనొక్కడినే), 'యారాబ్' చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించిన విక్రమ్ సింగ్ ప్రస్తుతం కన్నడమూవీ 'రానా విక్రమ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు.