చాలా ఏళ్ళ కిందట సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా సూపర్ హిట్. తెలుగులో మొదటి కౌబోయ్ సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది. ఈ టైటిల్ ను ఇప్పుడు కృష్ణ అల్లుడు సుధీర్ బాబు వాడుకొంటున్నాడు. కాగా సుధీర్ బాబు, నందిత జంటగా రూపొందిన 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదలకు ముందే సుధీర్ బాబు కొత్త చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఏ.ఎన్.బోస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారైంది. అదే 'మోసగాళ్లకు మోసగాడు'. ఈ చిత్రాన్ని 'స్వామిరారా' నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఇటీవలే బ్యాంకాక్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.