పవన్ కళ్యాణ్ ఏదైనా విషయంలో హార్ట్ అయితే ఆయన మళ్ళీ అలంటి విషయాల జోలికి వేల్లడనే పేరుంది. ఆయనకు క్లోజ్ అయితే మాత్రం వాళ్ళ కోసం ఏమైనా చేస్తారాయన. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులు, దర్శకులు, నిర్మాతల విషయంలో పవన్ దృక్పథం నిక్కచ్చిగా ఉంటుంది. సినిమా ఆడినప్పుడు ఒక విధంగా, ఆడకపోతే ఒకలా ప్రవర్తించే వ్యక్తులంటే ఆయనకు అస్సలు పడదు. అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉంటారాయన. తనను కేవలం డబ్బులు సంపాదించిపెట్టే స్టార్ హీరోగా కాకుండా, ఒక మంచి ఆర్టిస్టుగా ట్రీట్ చేసే వాళ్ళకే పవన్ ఎక్కువ విలువ ఇస్తారు. అదే సమయంలో తనను నమ్ముకొని ఉన్న వాళ్లకు ఏదైనా అన్యాయం జరిగినా ఆయన అస్సలు ఊరుకోరు. తన వల్ల అయింది చేస్తారు. తాజాగా ఫిల్మ్ నగర్ లో ఓ వార్త పవన్ ముక్కుసూటితనానికి నిదర్శనమనే భావన కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్, వెంకటేష్ తో కలిసి 'గోపాల గోపాల' చిత్రం చేసాడు. దీనికి సురేష్ బాబు, శరత్ మరార్ లు నిర్మాతలు. సినిమా విడుదల తర్వాత మంచి లాభాలే వచ్చాయి. అయితే సురేష్ ప్రొడక్షన్స్ నుండి శరత్ మరార్ కు సంబంధించిన నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థకు రావాల్సిన లాభాల వాటాల్లో తేడా వచ్చిందని, తన స్నేహితుడికి అన్యాయం జరిగిందనే కోపంతో పవన్ ఇకపై సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.