టాలీవుడ్ యువ హీరోయిన్లలో రెజీనా ఒకరు. అందం, అభినయం కలగలిసిన ఈమెకు యంగ్ హీరోల సరసన తప్ప స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం లేదు. తనతో పాటు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్లాంటి వారు దూసుకు పోతుంటే ఈమె మాత్రం సాయిధరమ్ తేజ్ వంటి హీరోలతో అడ్జెస్ట్ అయిపోతుంది. కెరీర్ లో ఆమెకు ''పిల్లా.. నువ్వు లేని జీవితం" తప్ప పెద్ద హిట్ లేదు. దీంతో స్టార్ హీరోలు ఆమెను పట్టించుకోవడం లేదు. ఇది ఆమె దురదృష్టమనే చెప్పాలి. 'పవర్' చిత్రంలో రవితేజ సరసన సెకండ్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఆమెకు స్టార్స్ చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా, పెద్దగా గుర్తింపు లేని పాత్రలే వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె సాయిధరమ్ తేజ్ సరసన దిల్ రాజు నిర్మిస్తున్న 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'లో మరో సారి నటిస్తోంది. ఈ చిత్రమైనా ఆమెకు లాక్ ను తీసుకొని వస్తుందో లేదో చూడాలి. కానీ ఈ అమ్మడు కెరీర్ పరిస్థితి ఇలా ఉంటే ఆమె మాత్రం.. నాకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో చేయడమే తన లక్ష్యం అంటోంది. మరి ఇది దురాశేనా? లేక ఆమెకు ఇలాంటి అవకాశాలు వచ్చి ఆమె కోరిక నెరవేరుతుందా? ఎండమావిలా మిగిలిపోతుందా? అనేది చూడాలి..!