సౌత్ హాట్ హీరోయిన్ నయనతార చుట్టూ ఉన్నన్ని రూమర్స్ మరే హీరోయిన్ చుట్టూ లేవంటే నిజమే అనాలి. ఎప్పుడు ఏదో ఒక రూమర్ తో ఉంటూనే ఉంది. ఆ రూమర్స్ అన్నీ ఆమె లవ్ ఎఫైర్ల చుట్టూనే తిరుగుతుంటాయి. అయితే ఇప్పటి వరకు రూమర్ల గురించి పెద్దగా పట్టించుకోని నాయన తాజాగా నోరు విప్పింది. తన జీవితంలో ప్రేమ వ్యవహారం ఒక్క ప్రభుదేవాతో మాత్రమే ఉందని తెలిపింది. గతంలో అతన్ని ప్రేమించిన మాట నిజమే. కానీ ఆ తర్వాత పలు కారణాలతో విడిపోయాం. ప్రస్తుతం నేను సింగిల్. నాకు బోయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. మీడియాలో నాపై వస్తున్న వార్తలన్నీ కేవలం రూమర్లు మాత్రమే.. అంటోంది. అయితే సినీ జనాలు మాత్రం మరోల అంటున్నారు. ఎఫైర్లు క్లోజ్ అయ్యాక ఎవరైనా ఇలానే మాట్లాడుతారు.. అని సెటైర్లు వేస్తున్నారు.