నందమూరి కళ్యాణ్ రామ్ తన స్వీయ నిర్మాణంలో హీరోగా నటించిన చిత్రం 'పటాస్' విడుదలై ఇన్ని రోజులైనా దాని హవా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం పెట్టుబడి, మార్కెటింగ్ ఇతర ఖర్చుల్లు పోను ఆరుకోట్ల ఆదాయం సాధించింది. ఇక ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను కూడా ఓ ప్రముఖ లీడింగ్ చానెల్ 4 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుందని సమాచారం. మొత్తానికి 'పటాస్' చిత్రం ప్రతి ఒక్కరికి రూపాయకి రెండు మూడు రూపాయలు లాభం సంపాదించిపెడుతోంది. ఇప్పటికీ కలెక్షన్లు స్టడీగా ఉండటంతో 'టెంపర్' రిలీజ్ వరకు ఈ చిత్రం హవా కొనసాగుతుందని స్పష్టమవుతోంది.