సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని తన సొంతూరు బుర్రిపాళెంను దత్తత తీసుకోనున్నట్లు సమాచారం. స్మార్ట్ విలేజ్ గా డెవలప్ చేయడానికి ఆ గ్రామాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గుంటూరు ఎంపీ, మహేష్ బావ గల్లా జయదేవ్ వెల్లడించారు. అలాగే కృష్ణ గారి పెద్ద అమ్మాయి.. మహేష్ సోదరి అయిన పద్మ కంచర్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని స్మార్ట్ విలేజ్ గా ఎడాప్ట్ చేయనున్నారని ఆయన తెలియజేసారు. మొత్తానికి తన సొంతూరు అయిన బుర్రిపాళెంను దత్తత తీసుకుంటున్న మహేష్ మాటల్లో గాక చేతల్లో పని చేసి చూపించడం, తన మాతృభూమి ఋణం తీర్చుకున్నట్లే అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు.