Advertisementt

మహేష్ త్రివిక్రమ్ సినిమాపై వార్తలు..!

Thu 05th Feb 2015 12:51 AM
mahesh babu,trivikram sreenivas,devisriprasad,samantha  మహేష్ త్రివిక్రమ్ సినిమాపై వార్తలు..!
మహేష్ త్రివిక్రమ్ సినిమాపై వార్తలు..!
Advertisement
Ads by CJ

త్వరలో మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందడం ఖాయమని, ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత, సంగీత దర్శకునిగా దేవిశ్రీప్రసాద్ లు ఉంటారని, కాగా ఈ చిత్రానికి 'పార్ధు' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని కూడా 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాల నిర్మాత రాధాకృష్ణ తన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించనున్నారని కూడా తెలుస్తోంది. 'పాదు' అనే పేరు 'అతడు' చిత్రంలో మహేష్ పాత్ర పేరుగా పాపులర్ అయింది. ఇక ఇదే కనుక జరిగితే చాలా విధాలుగా ఈ చిత్రం అనేక ప్రత్యేకతలు కలిగిన చిత్రంగా మిగిలిపోతుంది. ఇంతకు ముందు మహేష్ బాబు-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో 'అతడు, ఖలేజా' చిత్రాలు వచ్చాయి. దీంతో త్వరలో ప్రారంభమయ్యే త్రివిక్రమ్ సినిమా వీరి కాంబినేషన్ లో మూడో చిత్రం అవుతుంది. ఇక మహేష్ సినిమాలైన '1', 'శ్రీమంతుడు' చిత్రాల తర్వాత మహేష్ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించే మూడో చిత్రం త్రివిక్రమ్ సినిమానే అవుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత నటించే మూడో చిత్రం ఇదే అవుతుంది. ఇంతక ముందు వీరు 'అత్తారింటికి దారేది', ప్రస్తుతం తీస్తున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' తర్వాత మహేష్ సినిమా మూడోది అవుతుంది. ఇక మహేష్-సమంతలు కలిసి నటించే మూడో చిత్రం ఇదే అవుతుంది. ఇంతక ముందు వీరు జంటగా 'దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలలో కలిసి నటించారు. ఇక నిర్మాత రాధాకృష్ణకు త్రివిక్రమ్ తో మూడో చిత్రం అవుతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో 'జులాయి' తో పాటు ప్రస్తుతం చేస్తోన్న 'సన్నాఫ్ సత్యమూర్తి' కుడా చేరుతుంది. ఇలా ఈ చిత్రం కనుక సెట్ అయితే ఇది ఓ ప్రత్యేకత కలిగిన చిత్రంగా నిలుస్తుందని మహేష్ అభిమానులు ఆనందపడుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ